నకిలీ విత్తనాలు,నకిలీ పురుగులు అమ్మితే కఠిన చర్యలు తప్పవు ఎస్సై విజయకృష్ణ

Published: Wednesday June 02, 2021
గుమ్మడిదల, ప్రజాపాలన.ప్రతినిధి : మండలంలో నకిలీ విత్తనాలను,అలాగే నకిలీ పురుగుల మందులను రైతులకు అమ్మిన వారిపై కఠిన చర్యలు ఉంటాయనీ,అలాంటి వ్యక్తులపై పిడి యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ఎస్సై విజయ్ కృష్ణ అన్నారు. గుమ్మడిదల లోని పలు విత్తనాల, ఫర్టిలైజర్ల దుకాణాలను ఎస్సై పరిశీలించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రతి రైతు విత్తనాలను వ్యవసాయ శాఖ నుండి అనుమతి పొందిన డీలర్ వద్దనే కొనాలని. నకిలీ విత్తనాలను అమ్మే వ్యక్తుల గురించి ఎవరికైనా తెలిసినట్లైతే మాకు సమాచారం ఇవ్వాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిని ప్రోత్సహించిన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడతాయని తెలియజేశారు. అంతేకాకుండా రెండు మూడు రోజుల్లో రైతులు, వ్యవసాయ అధికారులు డీలర్లతో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.