తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2022 పుస్తకం

Published: Tuesday June 14, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 13 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వం ప్రచురించిన తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం -2022 పుస్తకాన్ని రూ 150 లకే ప్రజలకు అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం -2022 ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పుస్తకం ఉద్యోగులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పరిశోధకులకు, వివిధ రంగాలలోని నిపుణులకు ఉపయుక్తంగా ఉంటుందని, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉండడం  జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.