ప్రాథమిక ఆరోగ్య కేంద్రoలో ఖాళీగా ఉన్న డాక్టర్స్, సిబ్బంది పోస్టులను భర్తీ చెయాలి

Published: Monday April 26, 2021
మధిర, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : భర్తీ చేసిదెందుకురు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(DYFI) జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ రోజు డివైఎఫ్ఐ బృందం దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రంలో ఉన్న పరిస్థితిని డ్యూటీలో ఉన్న సిబ్బందిని చికిత్స కోసం వచ్చిన రోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది.అనంతరం మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ... ఈ హాస్పిటల్ బిల్డింగ్ సక్రమంగా లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలతో బాలింతలు, వృద్ధులు ఎండలో రోడ్లపై వేచి ఉండాల్సి వస్తోందని అన్నారు. హాస్పటల్ కు ఇద్దరు డాక్టర్స్ పోస్టులు ఖాళీగా ఉండగా తాత్కాలికంగా ఒక్క కాంట్రాక్ట్ డాక్టర్ మాత్రమే ఉన్నారన్నారు.దెందుకూరు పీహెచ్సీలో ఫార్మాసిటీకల్ లేక రోగులకు మందులు అందించడం లేదని కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కు వాళ్ల గ్రామాలలో ఆశావర్కర్లు వద్ద తీసుకోవాలని చెప్పి పంపడం ఆశా వర్కర్లును అడిగితే కరోనా వస్తే ఎలాంటి మందులు ఇస్తారో తెలియదని మా వద్ద మందులు లేవని చెప్పటంతో రోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు డాక్టర్స్ రెండు, ఏఎన్ఎంలు రెండు, పార్మాసిటికల్స్ రెండు, ల్యాబ్ టెక్నీషియన్ మూడు, స్టాఫ్ నర్స్ నాలుగు, స్లీపర్ ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని వీటిని వెంటనే పర్మినెంట్ గా భర్తీ చేయాలని, అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఖాళీలను భర్తీచేసి కరోనా మహమ్మారి  విజృంభిస్తున్న సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా 24 గంటలు వైద్య సేవలు అందించాలని ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వైద్యసేవలను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలకు ఉచిత మెరుగైన వైద్య సేవలుఅందించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని దీని వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని వెంటనే ప్రజా సంక్షేమాన్ని ఆలోచించి ప్రభుత్వం స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆస్పత్రి సమస్యలపై పోరాటం నిర్వహిస్తామని ఈ పోరాటంలో ఈ ప్రాంత ప్రజలంతా కలిసి రావాలని ప్రజా ప్రతినిధులను ఆస్పటల్ సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అల్లూరి నాగేశ్వరరావు, ఓట్ల శంకర్రావు డివైఎఫ్ఐ నాయకులు కేసరివీరభద్రం, ఎలిజాలగోపి, కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.