విద్యార్థులను అభినందించిన జడ్పీటీసీ

Published: Friday November 11, 2022

జన్నారం, నవంబర్ 10, ప్రజాపాలన: ఇటీవల హైదరాబాద్ నృత్య పోటీలలో ప్రతిభ కనబరచి బహుమతులను పొందిన మండలంలోని శ్రీ రాఘవేంద్ర లిటిల్ హాండ్స్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను మండల జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ అభినందించారు. గురువారం  మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో చదువుతోపాటు నృత్య పోటీలలో కూడా రాణించాలన్నారు. ఇటివల విజయ మాధవ సేవ సంస్కృతిగా అకాడమీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాదులో నిర్వహించిన నాట్య పోటీలలో పాల్గొని బహుమతులను పొందిన మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హాన్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఘనంగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహకులు, మోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, కరస్పాండెడ్ ఎర్ర సంపత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.