ఎన్టీఆర్ కుటుంబం ఘన చరిత్ర కలిగిన కుటుంబం

Published: Friday May 21, 2021
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఆశ భాదిత కుటుంబాలకు సరుకులు, కూర కాయలు పంపిణి
మధిర, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణం ఆజాద్ రోడ్ లో ప్రముఖ సామజిక సేవకుడు ఆరోగ్యపర్యవేక్షకుడు (మధిర ఆశ మిత్ర) లంకా కొండయ్య నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆశ భాధితుల పునరావాస సహాయ సేవా కేంద్రం నందు మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మనుమడు జూనియర్ NTR పుట్టినరోజు మరియు స్థానిక ఆజాద్ రోడ్ లో ఉన్న RK కిరాణా యజమాని తుమ్మలపల్లి రామకృష్ణ మూడవ కుమారుడు తుమ్మలపల్లి మనోజ్ కుమార్ పుట్టినరోజు సంయుక్తoగా మధిర ఎర్రుపాలెం మండలంలో ఉన్న ఆశ బాధితుల కుటుంబాలకు ఒకొక్కరికి ఒక నెలకు సరిపడా కిరాణా సరుకులు మరియు కూరగాయలు లంకా కొండయ్య తుమ్మలపల్లి కల్పన, తుమ్మలపల్లి ఉదయకుమార్ చేతుల మీదుగా పంపిణి చేసినారు. ఈ సందర్బంగా దాతలు మాట్లాడుతూ సెకండ్ వేవ్ లాక్ డౌన్ కరోనా భయం తో ఏ పని చేసుకో లేని నిరుపేద కుటుంబాలు కొండయ్య గారు చూపించగా మానవత్వంతో చలించి వారికీ ఈ కొద్దీ సహాయం జూనియర్ NTR పేరు మీద కరోనా రూల్స్ పాటిస్తూ గురువారం ఉదయం 8 గంటలకు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో లంకా సేవా ఫౌండేషన్ వాలంటీర్లు అధిములం వెంకటేష్ (వెంకీ ), పంతంగి  అనిల్, T మనోజ్, v కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పది కుటుంబంలకు పది వేల రూపాయలు సరుకులు ఉచితంగా పంపిణీ చేసిన RK కిరాణా యజమాని రామకృష్ణ, కల్పన దంపతులకూ కొండయ్య హృదయ పూర్వక అభినందనలు తెలియజేసారు.