అంగన్వాడీ టీచర్ ల సమస్య లు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికా

Published: Saturday October 29, 2022

పెండింగ్ లో ఉన్న ఆరోగ్యలక్ష్మి గ్యాస్ ఈవెంట్ బిల్లులు మంజూరు చెయ్యాలని ,లబ్ధిదారులకు సరఫరా చెయ్యాల్సిన కోడిగుడ్ల పంపిణి లో అలసత్వం ప్రదర్శిస్తున్న గుత్తేదరు పై చర్యలు తీసుకోవాలని  8 నెలలు గా పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ సెంటర్ ల సమస్య లు పరిష్కరించాలని, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం అశ్వాపురం లో జరిగిన అంగన్వాడీ టీచర్ ల మీటింగ్ లో అయన ప్రసంగిస్తు గత 8నెలలు గా బూర్గంపహాడ్ ప్రాజెక్ట్ లో పెండింగ్ లో ఉన్న ఆరోగ్యలక్ష్మి గ్యాస్ ఈవెంట్ ఇంటి అద్దెల బిల్లులు చెల్లించాలని అయన కోరారు. మాత శిశు సంరక్షణ లో ప్రధానమైన పౌష్టిక ఆహారం పంపిణి లో కోడిగుడ్డు పంపిణి లో నిర్లక్ష్యం వహిస్తూ లబ్ధిదారులు టీచర్ లు ఆయాలను ఇబ్బందులకు గురి చేస్తున్న గుత్తేదరు పై చర్యలు తీసుకోని కోడిగుడ్డు లను సక్రమంగా పంపిణి చేసే విదంగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు భారతి, అరుణ రమాదేవి ,విజయలక్ష్మి, కమలా విజయవిలాసం తదితరులు పాల్గొన్నారు.