ఏసుక్రీస్తు మార్గం ప్రపంచానికే ఆదర్శం

Published: Saturday November 26, 2022
డోర్నకల్ బిషప్ పద్మారావు* 
 మధిర నవంబర్ 25 (ప్రజా పాలన ప్రతినిధి) యేసుక్రీస్తు మార్గం ప్రపంచానికే ఆదర్శనీయమని సిఎస్ఐ డోర్నకల్ అధ్యక్ష మండలి బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆత్కురు గ్రామంలో నూతన నిర్మిస్తున్న సిఎస్ఐ దేవాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపులను పరిరక్షించేందుకు యేసుక్రీస్తు శిలువపై మరణం పొందారన్నారు. ప్రేమ, జాలి, దయ,కరుణతో ప్రతి ఒక్కరూ జీవించాలని ఏసుక్రీస్తు బోధించిన బోధనలను పాటించాలన్నారు. ఏసుక్రీస్తు మార్గం ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరు ఆయన మార్గంలో నడవాలన్నారు. ఆత్కూర్ గ్రామంలో నూతన దేవాలయం నిర్మాణం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం త్వరగా పూర్తి కావాలని ఆయన ప్రార్థించారు. రెవ.పి.సర్జన్ కుమార్  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిషప్ సతీమణి విజయ పద్మారావు  సెక్రెటరీ కంటెపూడి జయరాజు ట్రెజరర్ దారా కృపనందం,
బి జయప్రకాష్, పి ఆధాం, యన్ ప్రేమ్ కుమార్, కంటేపుడి అన్నపూర్ణ, పి థెరిస్సా డి జయమ్మ తదితరులు పాల్గొన్నారు