కలకోట ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ల వితరణ

Published: Tuesday October 11, 2022
 బోనకల్, అక్టోబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట ఉన్నత పాఠశాలలో సోమవారం తోక చిచ్చు చెన్నంరాజు జ్ఞాపకార్థంగా వారి కుమారులు మురళీధర్ రాజు, సత్యనారాయణ రాజులు రూ 4 లక్షల విలువ చేసే అది కంప్యూటర్లు ఫర్నిచర్ ను తల్లి సత్య సావిత్రి, ఎంఈఓ ఎం ఇందిరా జ్యోతి చేతులమీదుగా అందజేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకుగాను గ్రామానికి చెందిన పిసిసి సభ్యుడు పైడిపల్లి కిషోర్ ఎన్నారై లను ఆశ్రయించాడు. స్పందించిన వారు విద్యార్థుల కోసం కంప్యూటర్లు ఫర్నిచర్ తో పాటు ఎలక్ట్రికల్ పనులను కూడా పూర్తి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం ఎంతగానో అవసరం అన్నారు. విద్యార్థులు దాతలు ఇస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సునీత, ఎస్ఎంసి చైర్మన్ రత్నాకర్, ఉపాధ్యాయులు జ్ఞానేశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.