ఆసరా పింఛన్ల నమోదు సరళి పరిశీలన

Published: Tuesday August 17, 2021
వికారాబాద్ జిల్లా ఏ. పి. ఓ పెన్షన్ అధికారి  శ్రీలక్ష్మి, ఏ పీ ఎం ఎం కమలాకర్ 
వికారాబాద్ బ్యూరో 16 ఆగస్ట్ ప్రజాపాలన : ఆసరా పెన్షన్ లు దరఖాస్తు చేసుకొనుటకు 57 సంవత్సరాలకు ప్రభుత్వం సవరించిందని జిల్లా అధికారిణి తెలిపారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని కొత్తగడి మీ సేవా కేంద్రంలో ఆసరా పెన్షన్ల దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నమోదు చేసుకొనుటకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. మీ సేవా కేంద్రాలలో ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. ఇట్టి ప్రక్రియను మీసేవ కేంద్రాలలో ఏ విధంగా నిర్వహిస్తున్నారని అభ్యర్థుల నుండి ఏ విధమైన రుసుము వసూలు చేస్తున్నారని వంటి విషయాల గురించి ఆరా తీశారు. వారి నుండి ఏ పత్రాలు సేకరిస్తున్నారని కొత్తగడి లోని యం.ఎస్.ఆర్ కంప్యూటర్స్, మీసేవ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు దరఖాస్తుదారుల నుండి ఎలాంటి రుసుములు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరించాలని. వయసు ప్రామాణికంగా ఓటర్ ఐడీ కార్డు, బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి మేము లేదా పాఠశాల నుండి ఏదైనా ధ్రువీకరించిన పత్రాలు వయసు కొరకు ప్రామాణికంగా తీసుకొని వీటిని మాత్రమే అంగీకరించాలని సూచించారు. 57 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే దరఖాస్త స్వీకరించాలని ఆపై వయస్కులు సంబంధిత ఎండిఓ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని దరఖాస్తుదారులకు తెలియజేయాలని మీసేవ నిర్వాహకులు ముత్తెరగళ్ళ శేఖర్, ఆపరేటర్ జీ.ప్రసాద్ లకు  సూచించారు.