ఫోటో గ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం

Published: Wednesday October 19, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 18, ప్రజాపాలన: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆసక్తిగల ఫోటో గ్రాఫర్ల కు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం తెలిపారు. శాంతి భద్రతల సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి రామగుండము పోలీస్ కమీషనరేట్  పెద్దపల్లి ,మంచిర్యాల జోన్ పరిధిలో ఆసక్తి గల విధ్యార్థిని, విధ్యార్థులు, యువతక ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని  రామగుండము పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. వారి యొక్క ప్రతిభను బట్టి విజేతలుగా నిలిచిన వారికి మొదటి, రెండవ, మూడవ  బహుమతులు మెరిట్ సర్టిఫికెట్స్ తేదీ: 31-10-2022 నాడు అందజేస్తామని తెలిపారు. షార్ట్ ఫిలిం తీసి పంపేవారు ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించ కూడదు, అలాగే తీసిన షార్ట్ ఫిలింను సిడిలో,పెన్ డ్రైవ్ లో మీ యెక్క పూర్తి వివరాలతో తేదీ: 25-10-2022  సాయంత్రం వరకు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో లేదా, రామగుండం కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ లో అందజేయాలని అన్నారు.కమిషనరేట్ స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను స్టేట్ కాంపిటేషన్ గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాద్ కు పంపించడం జరుగుతుందని అన్నారు.