ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్ర, *ప్లాన్ ప్రకారమే తెలంగాణ ప్రజలపై దాడికి ప

Published: Thursday March 09, 2023
* మాజీ టిఎస్ఈడబ్ల్యూఐడిసి ఛైర్మన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాగేందర్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 8 మార్చి ప్రజాపాలన : 
ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న కుట్ర కాదు.!  తెలంగాణ ప్రజానీకం పై జరుగుతున్న కుట్ర.!!
మహిళా దినోత్సవం రోజున ఒక మహిళ పై మోడీ ఈడి పనికట్టుకొని చేస్తున్న కుట్ర.!!
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం ఆగం చెయ్యడానికి ఈ ఈడీలు,  మోడీ కేడీ లు కుట్ర చేస్తున్నాయి.
మహిళ దినోత్సవం రోజునే., మహిళల గొంతును నొక్కే ప్రయత్నం.!!
తెలంగాణను అణగదొక్కే యత్నం.,  గొంతు నొక్కే ప్రయత్నం.!! రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక తెలంగాణ నా కుటుంబం అనుకునే కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న దాడి పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ టిఎస్ఈడబ్ల్యూఐడిసి
 ఛైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాగేందర్ గౌడ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలో మార్చ్ 9 న ఢిల్లీలో విచారణకు రావాల్సింగా ఈడి నోటీసులు జారీ చేయడం రాజకీయ కుట్రలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాగేందర్ గౌడ్ తెలిపారు.
మంచికి చెడుకి మధ్య యుద్ధం. నీళ్లకి లిక్కర్ కి మధ్య యుద్ధం.,!!