ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 8ప్రజాపాలన ప్రతినిధి *ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా రేవం

Published: Wednesday November 09, 2022
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  ఎనుముల రేవంత్ రెడ్డి  పుట్టినరోజును పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో టిపీసీసీ రాష్ట్ర ప్రతినిధి చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది* ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైన ఇబ్రహీంపట్నం జడ్పిటిసి భూపతిగల్ల మహిపాల్  సీనియర్ నాయకులు కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి గారు.పండాల శంకర్ గౌడ్ విచ్చేసి  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి  అనంతరం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఒక రేవంత్ రెడ్డి మాత్రమేనని రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపి ఒకటేనని కేవలం తమ టిఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం బిజెపితో లోపల కుదుర్చుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి 50 లక్షల సభ్యత్వం ఉందని,కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటినుంచే బూత్ స్థాయిలో కార్యకర్తలను పట్టిష్టం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు.ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆయురారోగ్యాలు అదేవిధంగా అవినీతి బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడే శక్తి ఇవ్వాలని  ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఈర్లపల్లి సునీత వెంకటరెడ్డి.ఆకుల మమత ఆనంద్. నరాల విశాలసాగర్.. పంది శంకరయ్య. మోహన్ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జడల రవీందర్ రెడ్డి తోపాటు నాయకులు కొండ్రు ప్రవీణ్ కుమార్.. తాళ్ల బాలశివుడు గౌడ్.. ప్రేమాకర్ రెడ్డి.. సాప్పరి రవికుమార్..పెద్దగారి శ్రీకాంత్.. మంకాల కరుణాకర్.. పంది యాదగిరి.. నాగార్జున.చిన్న.. పోలోమొని రామకృష్ణయాదవ్..సురేందర్ గోపాల్..శ్రీశైలం, సుధాకర్, కిరణ్,నందకిషోర్.ఇమ్రాన్.సోహెల్.,సికిందర్, ప్రవీణ్, నరేష్,హరీష్, .జొన్న,. తోపాటు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.