నవంబర్ 26న తెలంగాణ సంస్కృతి డెమో

Published: Thursday November 18, 2021
వికారాబాద్ బ్యూరో 17 నవంబర్ ప్రజాపాలన : జీవిత గమ్యానికి సాధించాలనే లక్ష్యం ప్రతి మనిషికి ఉండాలి. సమాజంలో మానవ విలువలతో గౌరవ ప్రదంగా బతికేందుకు ఒక నిర్దేశాన్ని నిర్ణయించుకోవాలి. నలుగురికి ఆదర్శంగా నిలబడలేకపోయినా, కనీసం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలి. ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎల్లప్పుడు వడ్డించిన విస్తరిలా జీవితం ఉండదు. ఎన్నో ఆటుపోటులను అధిగమించాల్సి ఉంటుంది. మన లక్ష్యం మంచిదైనప్పుడు ఎన్ని ఆటంకాలైనా ఎదురించే దృఢ సంకల్పం తోడుంటుంది. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అన్నారు స్వీయానుభవజ్ఞులు. ఆ కోవలోకి వచ్చిన వ్యక్తే ఎకెఆర్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకుడు బి వి రమణ. సామాజిక స్పృహతో ఎందరెందరో జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపడానికి అహరహం పరితపిస్తున్నాడు. అది కేవలం విద్య ద్వారానే సాధ్యమని నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. శ్రమయే వర్ధతే విద్య అను నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నాడు. నిరుద్యోగుల పాలిట కల్ప వృక్షంగా నిలవాలని తాపత్రయపడుతున్నాడు. నిరుద్యోగార్థుల ఆశాజీవిగా కొండంత అండగా నిలుస్తున్నాడు. నవంబర్ 26 శుక్రవారం రోజున తెలంగాణ సాహిత్యంలో భాగంగా తెలంగాణ సంస్కృతిని అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన భాష, యాసను మరిచిపోతున్న నేటి సమాజానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు ప్రముఖ విషయ నిపుణులు డాక్టర్ శ్రీనివాసాచారి. తెలంగాణ పండుగలు, తెలంగాణ జాతరలు, తెలంగాణ ఉద్యమ పాటలు, తెలంగాణ సినిమా పాటలు, తెలంగాణ వంటకాలు, తెలంగాణ ఆటలు వంటి ఎన్నో అత్యుత్తమ అంశాలను విడమరిచి పూసగుచ్చినట్లు వివరించనున్నారు డాక్టర్ శ్రీనివాసాచారి. జీవితంలో స్థిరపడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలనుకునే ప్రతి నిరుద్యోగార్థి ఈ డెమో క్లాసును వినడానికి త్వరపడండి. 26 నవంబర్ 2021 శుక్రవారం ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. శివరాంనగర్ లోని శ్రీ హనుమాన్ దేవాలయం పక్కన గల ఎకెఆర్ స్టడీ సర్కిల్ లో వ్యవస్థాపకుడు బి వి రమణ మంచి అవకాశాన్ని కల్పించారు. ఆలస్యమైతే ఆశాభంగం అవుతుంది. ఉద్యోగ సాధనకు ఉపయోగపడే మంచి విషయ టిప్స్ ను నిరుద్యోగార్థులు కోల్పోరాదని ఆశిద్దాం.