ఉపాధి బిల్లులు వచ్చేంతవరకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపిపి సుకన్య తెలిపారు

Published: Wednesday May 18, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 17 ప్రజాపాలన ప్రతినిధి.
యాచారం మండలం  ముగ్గుల్ల ఒంపు  సింగారం గ్రమలలో
ఎర్రటి ఎండలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ఎంపీపీ కొప్పు సుకన్య కూల్ డ్రింక్స్ ఇచ్చి డప్పిక తీర్చడం  మంచిదే. కానీ జనవరి  నుండి పనిచేస్తున్న  కూలీలకు   కేంద్ర బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వక  పోవడం తో  తీవ్ర ఆర్థిక  ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు . పెండింగ్ బిల్లులు విడుదల  చేయించి  కూలీలా కష్టాలు  తీర్చే విధంగా చూడాలని .పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మంచి నూనె  ధరలు  పెంచడంవలన కూలీలమీద మరింత అదనపు భారం పడ్తుంది.ఉపాధి చట్టం లో  తెచ్చిన మార్పులు  కూలీలకు  తీవ్ర నష్టం  జరుగుతుంది
*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం*
                  *(AIAWU)*
మంగళవారం రోజు మొగుళ్ళ వంపు  సింగారం  గ్రామాలల్లో
కూలీలా సమస్యలు  తెలుసుకొని మాట్లాడు తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజయ్య   ఎంపీపీ కొప్పు సుకన్య  యాచారం  మొగుళ్ళ వంపు  గ్రామాలల్లో  ఉపాధి కూలీలా దగ్గరికి పోయి ఎర్రటి ఎండలో  పని చేస్తున్న కూలీలకు  కూల్ డ్రింక్స్ తో డప్పిక తీర్చడం  మంచిదే కానీ. 3 నెలల  నుండి  కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడం లేదు.రోజుకు 257 రూపాయలు  నిర్ణహించిన  కొలతల పేరుతో  100  నుండి 150 లోపే వస్తున్నవి  వచ్చే డబ్బులు కూడా సకాలంలో  కేంద్ర బీజేపీ ప్రభుత్వం  విడుదల  చేయక పోవడం . మరోపక్క   పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మంచి నూనె రేట్లు పెంచి కూలీలపైన  అదనపు  బారాలు మోపింది. ఉపాధి హామీ చట్టంలో  తెచ్చిన మార్పులు. పని ప్రదేశంలో  2సార్లు ఫోటోలు  అప్లోడ్ చేయడం. మాస్టర్లో ఇంటి పేరు లేకుండా ఇంగ్లీష్ లో  పేర్లు ఇవ్వడం .డిమాండు పెట్టుమున్నా తర్వాత  పనికి పోక పొతే పనిరోజులు  తగ్గి పోతున్నవి ఇది నష్టం . గ్రూపులుగా  కాకుండా  జాబ్ కార్డు ప్రకారంగా  పని వస్తుంది  ప్రతి వారం  ఎగ్రూపులో వస్తుందో తెలియని పరిస్థితి ఉంది.సమ్మర్ అలవెన్స్ రద్దు చేసినారు గడ్డ పార  మొన డబ్బులు రావడం లేదు వాటర్ బిల్లులు రావడం లేదు పే స్లిప్పులు ఇవ్వడం లేదు.మెడికల్ కిట్టు అందు బాటులో లేఖ పోవడం తో  దెబ్బలు తగిలినప్పుడు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా  రోజు కూలి 600 రూపాయలు  ఇయ్యాలి. సంవత్సరానికి 200 రోజులు పని. కల్పించాలి పోరాడి సాధించు కున్న ఉపాధి హామీ చట్టాన్ని తీసివేసే  కుట్రలో భాగంగా  ఇదంతా జరుగుతుంది కాబట్టి.ఎంపీపీ సుకన్య   కేంద్ర ప్రభుత్వనికి లేఖ రాసి పైన పేర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయగలరు అని ఎంపీపీ సుకన్యకు తెలిపారు
ఈ కార్యక్రమంలో  ఎర్ర జంగయ్య,  పద్మ,  సంతు,  సంతోష,  బాల్ రత్నం  జంగమ్మ  యాదమ్మ   నర్సింహా ఎల్లేష  కె మల్లయ్య,  డి మల్లయ్య.పారేష,  మంజుల,  అనిత,  తదితరులు ఉన్నారు.