తల్లాడ ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను.. తల్లాడ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి..

Published: Saturday October 01, 2022
తల్లాడ, సెప్టెంబర్ 30 (ప్రజా పాలన న్యూస్):
ప్రజలు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం తల్లాడ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను గ్రామసభలో మొర పెట్టుకోగా వాటిని పరిష్కరిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. అదేవిధంగా గుంటుపల్లి వెంకటయ్య పలు సమస్యలను లేవనెత్తారు. నూతన విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ తాగునీరు, తల్లాడ పట్టణంలో మహిళల సౌకర్యార్థం మరుగుదొడ్లు కట్టించాలని సర్పంచ్, ఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఈవో నరసింహారావు, సర్పంచ్ సంధ్యారాణి ఆ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి, గ్రామపంచాయతీ వీడీసీ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, పలువురు  వార్డు మెంబర్లు పాల్గొన్నారు.