రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్తో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే భట్టి

Published: Thursday April 29, 2021
మధిర, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర సివిల్ గవర్నమెంట్ హాస్పటల్లో డాక్టర్స్డెప్యూటేషన్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ తో స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫోన్లో మాట్లాడారు.కరోనా మధిరలో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో డాక్టర్స్ పాచాలాముఖ్యమైనదని ఇలాంటి తరుణంలో మధిర ప్రభుత్వ డాక్టర్లను బదిలీ చేయటం మంచిది కాదని, వాళ్ళని మధిరలో కొనసాగించేలా చర్య తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ మాలతి కి తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. హాస్పటల్లో పరిశీలించిన అనంతరం మీడియాతో భట్టి మాట్లాడుతూకరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాంశారు. ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ ఏర్పాటు చేయాలన్నారు. హాస్పిటల్ లో డాక్టర్ ల కొరతను భర్తీ చేయాలన్నారు. కరోనా వచ్చి సంవత్సరం అయినా హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ లేదని ఆరోపించారు. రోడ్ల మీదనే వైద్యం అందించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సీఎం ఉదసీన వైఖరే మరణాలకు కారణమన్నారు. ప్రజా ఆరోగ్య పై ప్రభుత్వంకు ఉన్న నిర్లక్ష్యంమే మరణాలకు కారణం. చచ్చే వాళ్ళు చావండి, బ్రతికే వాళ్ళు బ్రతకండి, ఉండవాల్లే మనల్లో అనే రీతిలో పాలనసాగుతున్న భట్టి. రాష్ట్ర ప్రభుత్వానికి  సచివాలయం లేదు. అధికార యంత్రాంగం సరిగా నడిపే వాళ్ళు లేరు. సీఎం ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. ఏ హాస్పిటల్ లో చూసిన లిమిటెడ్ గా టెస్టులు చేస్తున్నారు. 30% జనాభాకు కరోనా ఉంది.డ్రామాలు, మాటలు చెప్పేవాళ్ళు పాలనలో ఉండటం వలన సమాజం అతలాకుతలం అవుతుంది. కరోనాను కష్టడి చేసిన కొన్ని దేశాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇండియా అంటే భయపడే స్థాయిలో మిగతా దేశాలున్నాయి. ఇప్పటికైనా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడండి. ఇన్ని వేలమంది చనిపోతుంటే సెక్రటరీకి రాకుండా మౌంటర్ చేయకుండా.. పదవిలో కూర్చోకుండా పాలన ఎలా సాగుతుంది. యుద్ధ ప్రాతిపదికన సచివాలయం తెరవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు మాటాలు అపి పనిచేయాలి. ఈ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ కర్ణాటక రామారావు విజయ్ జహంగీర్  బాలరాజుహాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు