ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమల

Published: Monday April 10, 2023

కొత్తపల్లిలో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శనదేశంలో ఇంకా కొనసాగుతున్న కుల వ్యవస్థపేదలకు అందని విద్య, వైద్యం
కొంతమందికే కేంద్రంగా మారిన దేశ సంపద
గ్రామాలలో పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థ
అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలిభూమి కొంతమందికే పరిమితం కాకుండా జాతీయం చేయాలి.దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలు చేయడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ అన్నారు. శనివారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంగం శరణం గచ్చామి అనే నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాన్ వెస్లీ హాజరై మాట్లాడుతూ గ్రామాలలో ఇప్పటివరకు కుల వ్యవస్థ, వర్గ పోరు పట్టిపీడిస్తుందని మండిపడ్డారు.  అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందకుండా, కొన్ని వర్గాల వారు లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. హిందుత్వ భావజాలం దేశ ప్రజలపై రుద్దుతూ రాజకీయంగా లబ్ధి  పొందుతున్నారని తెలిపారు.  పేద కుటుంబాలకు విద్య, వైద్యం అందడం లేదని చెప్పారు. దేశంలో కుల వ్యవస్థ, వర్గా పోరు పోవాలంటే భూమిని జాతీయం చేయాలని వివరించారు. అంబేద్కర్ ఆలోచన విధానం దేశవ్యాప్తంగా అమలు కావాలంటే వెనుకబడిన వర్గాలు, పీడిత ప్రజలు ఏకమై ప్రభుత్వాలపై ఐక్య పోరాటాలు చేసినప్పుడే పది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం పూర్తిస్థాయి అమలు కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం సంగం శరణం గచ్చామి నాటక ప్రదర్శన చూడడానికి వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎండి హబీబుద్దిన్, ఎంపీటీసీ సుమతమ్మ,  కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు సామెల్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలంపల్లి నరసింహ, ప్రజా సంఘాల నాయకులు పగడాల యాదయ్య, జంగయ్య, కెవిపిఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు కావాలి జగన్ ఉప సర్పంచ్, దంతుక పెద్దయ్య సర్పంచ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య,  వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పోలే శివ, ఎస్ఎఫ్ఐ యాచారం మండల అధ్యక్షులు విప్లవ్ కుమార్, డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, సైదులు, నారాయణ వెంకటేష్, జంగయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.