కార్మికులు క్రీడల్లో పాల్గొంటూనే ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి బెల్లంపల్లి ఏరియా జిఎం. జ

Published: Friday November 04, 2022
బెల్లంపల్లి నవంబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి:  సింగరేణి కార్మికులు, సంస్థ నిర్వహించే క్రీడల్లో పాల్గొంటూ, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు కూడా సాధించాలని, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ జి, దేవేందర్ అన్నారు.
గురువారం  గోలేటి టౌన్షిప్ లోని భీమన్న స్టేడియంలో గత రెండు రోజులుగా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్, అండ్ గేమ్స్ అసోసియేషన్, ఆధ్వర్యంలో  నిర్వహించిన ఫుట్  పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ
 ఉద్యోగులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సింగరేణి విధి నిర్వహణలో,  ఇదే ఉత్సాహంతో కంపనీ  నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాదించడానికి కృషిచేయాలని కోరారు. ఉత్పత్తి  లక్ష్యాలను సాదించినప్పుడే, క్రీడలను కంపనీ మరింతగా ప్రోత్సహించి పోటీలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు.  కంపనీ స్థాయిలో మాదిరిగా కోల్ ఇండియా స్థాయిలో కూడా కార్మికులు గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు.
సంస్థ నిర్వహించిన ఈ కంపెనీ స్థాయి పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా జట్టుపై కొత్తగూడెం జట్టు గెలుపొందగా, విజేతలకు మరియు ఆటలు నిర్వహించిన వారందరికీ ఆయన బహుమతి ప్రధానం చేశారు.
       ఈ కార్యక్రమం లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు  మల్రాజు శ్రీనివాస్ రావు, స్పోర్ట్స్ సూపర్వైసర్ (కార్పోరేట్) సుందర్ రాజు , డీజీఎం సిబిల్, సతీష్ బాబు, పర్సనల్ మేనేజర్   ఐ, లక్ష్మణ్ రావు, డివైపిఎం, రెడ్డి మల్ల తిరుపతి , సీనియర్ పర్సనల్ ఆఫీసర్  జి, కే, కిరణ్ కుమార్ ,బెల్లంపల్లి ఏరియా స్పోర్ట్స్ ఇంచార్జి అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్ వైసర్  అశోక్, జాన్ వెస్లీ ,  పాస్నెట్,  పర్ష శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్  చంద్రకుమార్,   తదితరులు పాల్గొన్నారు.