సహకార సంస్థలో విత్తనాలు ఎరువులు లభ్యం

Published: Saturday June 12, 2021
వికారాబాద్ పిఏసిఎస్ చైర్మన్ మాసనగారి ముత్యం రెడ్డి
వికారాబాద్ జూన్ 11 ప్రజాపాలన బ్యూరో : రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు సహకార సంస్థలో అందుబాటులో ఉన్నాయని వికారాబాద్ పిఏసిఎస్ చైర్మన్ మాసనగారి ముత్యం రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించబడునని వివరించారు. యూరియా రూ.266.50, డిఏపి రూ.1200, పెసర్లు 2 కిలోల బస్తాకు రూ. 197.70, మినుములు 4 కిలోల బస్తాకు రూ. 426, కందులు 2 కిలోల బస్తాకు రూ.185.40, వడ్లు ఆర్ఎన్ఆర్ రకం రూ. 837.75, సిపి, బయో సీడ్స్, విక్రమ్ కంపెనీల ద్వారా ఏడు రకాల మక్కలు అందుబాటులో ఉన్నాయి. మక్కల విత్తనాల ధరలకు వికారాబాద్ సహకార సంస్థలో సంప్రదించాలని సూచించారు. నేడు రెండవ శనివారం అయినప్పటికీ సహకార సంస్థ తెరిచే ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుందని తెలిపారు. రైతులు దళారుల వద్ద కొని మోసపోవద్దని హితవు పలికారు.