ప్రజలను నిలువ దోపిడీ చేస్తున్న పాల్వంచర రిలయన్స్ సూపర్ మార్కెట్

Published: Tuesday September 27, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ సూపర్ మార్కెట్ లో కుళ్ళిపోయిన కూరగాయలు , పళ్ళు, ఎప్పటినుంచో స్టాక్ ఉన్న ఐటమ్స్ సూపర్ మార్కెట్లో నిలువ ఉంచి ప్రజల జేబులికి చిల్లు వేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే మాకు ఏమి సంబంధం లేదు పైవారు ఎలా చెబితే మేము అలాగే చేస్తామని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. కనీసం సరుకులు తీసుకుంటే అక్కడ చిన్న కాటన్ క్యారీ బ్యాగ్ కూడా సూపర్ మార్కెట్లో ఇవ్వని పరిస్థితి. అంతేకాకుండా ఆ కాటన్ కవర్లకు కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. వస్తువులు కొంటే కనీసం క్యారీ బ్యాగ్, కాటన్ క్యారీ బ్యాగ్ ఇవ్వాలని ఉన్నాగాని వారు ఇవ్వడం లేదు. ప్లాస్టిక్ నిషేధం అంటూనే విపరీతమైన ప్లాస్టిక్ ఐటమ్స్ అమ్ముతున్న వైనం. అధికారులు స్పందించి కుళ్ళిన కూరగాయలు పళ్ళు, నుంచి ప్రజలను రక్షించవలసిందిగా, ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిందిగా అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు..