అన్నారుగూడెంలో సైన్స్ దినోత్సవం..

Published: Wednesday March 01, 2023
తల్లాడ, ఫిబ్రవరి 28 (ప్రజా పాలన న్యూస్):
అన్నారుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా క్విజ్, వ్యాసరచన, సైన్స్ ప్రయోగాలు నిర్వహించారు.
సి వి రామన్ జీవిత చరిత్ర గురించి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్ధులు కి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. రమేష్, సైన్స్ ఉపాధ్యాయ లు
మాధినెని నరసింహ రావు, మురళీకృష్ణ, భాష్యా, పొట్ట రామారావు , పులి వెంకటేశ్వర్లు, సునీత పాల్గొన్నారు.