ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన, ఆర్డిఓ

Published: Wednesday May 18, 2022

ఇబ్రహీంపట్నం, మే  17 ( ప్రజాపాలన ప్రతినిధి ): మండలంలో అమ్మక్కపేట్, ఇబ్రహీంపట్నం, గోదూర్ , తిమ్మాపూర్, యామపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఆర్డిఓ వినోద్ కుమార్ పరిశీలించారు, రైతులకు ఇటివల కురిసిన వర్షానికి తడిసిన వడ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్ష సూచనలు ఉన్నట్లయితే రైతులు కుప్పలపై టార్పాలిన్ లు కప్పుకోవాలని ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మ్యాచ్ అర్  వచ్చిన వెంటనే వడ్లు తొందరగా తూకం వేయాలని  తూకం వేసిన  సంచులను వెంట వెంటనే రైస్ మిల్ కు పంపాలని సెంటర్ ఇంచార్జ్ లను ఆదేశించారు సన్న వడ్లలో కొన్ని రకాలు కొనుగోలు చేయడం లేదని రైతులు తెలపగ సమస్యను  పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు, అలాగే రైస్ మిల్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు, తొందరగా కొనుగోలు పూర్తి చేయాలని సెంటర్ ఇంచార్జ్ లను అధికారులను ఆదేశించారు, కార్యక్రమంలో తహశీల్దార్, మాహేశ్వర్, ఆర్ఐ భూమేశ్, పి.ఏ.సి.ఎస్ సీఈఓ, సతీష్ , విఆర్వోలు విజయ్, రవి, నాయకులు నేమురి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.