డాక్టర్ వసంతమ్మగారి సేవా సదనము లో అన్న వితరణ

Published: Friday April 08, 2022
మధిర ఏప్రిల్ 7 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ప్రముఖ అధ్యాపకులు రిటైర్డ్ ఉపాధ్యాయుడు కీర్తిశేషులు కొలగాని వెంకటేశ్వర్లు సంవత్సరికం సందర్భంగా వారి కుమారులు బూసా కోటేశ్వరరావు 'కొలగని శ్రీనివాసరావు కొలగని ప్రసాదరావు కొలగని జగన్ మోహన్ డాక్టర్ వసంతమ్మరి సేవాసదనము మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు మరియు సిబ్బంది అన్న వితరణ నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సదనం డైరెక్టర్ డాక్టర్ కే షిలా రాము  మాట్లాడుతూ కొలగని వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు సేవా సదనము కేర్ టేకర్ నారి కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు