గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

Published: Friday July 09, 2021

స్వయంగా గ్రామ వీధులను శుభ్రపరిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం, జులై 08, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండలంలో పల్లె ప్రగతి, హరితహారంలో గ్రామాల సమగ్రాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రమైన జిన్నారం, కొడకంచిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. జిన్నారంలో స్వయంగా చీపురు పట్టుకొని గ్రామ విధులను శుభ్రపరిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య పనులకు ప్రథమంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఎవరికి వారు తాము నివసించే ప్రాంతాల్లో పరిషరాలను పరి శుభ్రంగా చూసుకోవాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచులు స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, టిఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల లో...
గుమ్మడిదల మండల పరిధిలోని రామ్ రెడ్డి భావి గ్రామంలో ఏర్పాటు చేసిన సిసి రోడ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.