ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 18ప్రజాపాలన ప్రతినిధి *పట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రామకృష్ణ*

Published: Wednesday October 19, 2022


మీర్ పేట్ పోలీసు స్టేషన్ నుండి  బదిలీపై వచ్చిన రామకృష్ణ ఇబ్రహీంపట్నంపోలీస్ స్టేషన్  సర్కిల్ ఇన్స్పెక్టర్ గా   పదవి బాధ్యతలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం నుండి  బదిలీపై వెళ్లిన  సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా విధుల్లో చేరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ  రామకృష్ణ కు  ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాగతం పలికి సన్మానించారు .  సి ఐ రామకృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడడమే ధ్యేయమని, పట్టణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కాలనీలలో అపరిచిత  వ్యక్తులు తచ్చాడినా   పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలనికోరడం జరిగింది.