వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి ** జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్ ** వన్యప్రాణ

Published: Saturday October 08, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 07 (ప్రజాపాలన, ప్రతినిధి) : వన్య ప్రాణుల సంరక్షణ తోపాటు అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్ అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవం  పురస్కరించుకొని వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని ఆసిఫాబాద్, రెబ్బన, రేంజ్ కార్యాలయాల సిబ్బందితో శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుండి నిర్వహించిన ర్యాలీని ప్లయింగ్ స్కాడ్ ఎఫ్ డి ఓ వేణు బాబుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణ తో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. కేవలం అటవీ అధికారులతో మాత్రమే సంరక్షణ సాధ్యం కాదని, దీంతో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. వన్యప్రాణుల రక్షణకు సిబ్బంది  నడుంకట్టాలని తెలిపారు. జిల్లాలో అటవీ ప్రాంతం సంరక్షించడంతో పాటు అన్య ప్రాణులను కూడా రక్షించాలని తెలిపారు. రవి ప్రాంతం రక్షణ కోసం ప్రజలతో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రజలతో మమేకమై పని చేసినప్పుడే అటవీ సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో అటవీ రక్షణ కోసం వేగులను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన,రేంజ్ అధికారి అప్పలకొండ, గాడిపెళ్లి శ్రీధర్ చారి, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ప్రవీణ్ కుమార్, సరోజ రాణి, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, పాల్గొన్నారు.