సర్పంచ్ కొమ్మినేని రవీందర్ అధ్యక్షతన గ్రామసభ

Published: Thursday April 01, 2021
మహబూబాబాద్, మార్చి 31, ప్రజాపాలన ప్రతినిధి : దంతాలపల్లి మండలంలోని దాట్ల గ్రామంలో గ్రామసభను సర్పంచ్ కొమ్మినేని రవీందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో గ్రామ పంచాయతీ సిబ్బందిపై, గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. వారు చేయవలసిన పనుల సరిగా నిర్వర్తించడం లేదని అన్నారు. అలాగే పలు శాఖలపై వైద్య శాఖపై, NREGS శాఖలపై కూడా అసహనం వ్యక్తపరిచారు. మేము చేసిన పనులకు మాకు సరైన వేతనం ఇవ్వడం లేదని చేసిన పనులకు డబ్బులు కూడా రావటం లేదని APO మాధవి ని అడిగారు. కల్లాల నిర్మాణము చేసుకుంటే మాకు ఇంత వరకు బిల్లులు రాలేదని అన్నారు.అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ మాట్లాడుతూ వీటి అన్నీటి గురించి మాకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదని మీరు చెప్పిన విషయాలన్నీ మేము వచ్చే గ్రామ సభ వరకు నెరవేరుస్తామని అన్నారు. ఎవరైనా పని చేయని ఎడల వారిని తొలగిస్తామని అన్నారు. అలాగే MPTC సతీష్ మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలు ఉన్నవి అవి నెరవేర్చగలరని సర్పంచ్ గారిని కోరారు. అలాగే పంచాయితీ కార్యదర్శి పై జనన, మరణ ధ్రువ పత్రాలకు వచ్చిన వారిని డబ్బులు వసూలు చేస్తున్నారని మాతో చెప్పారని MPTC సతీష్ అన్నారు. పద్దతి మార్చుకోవలసిందిగా కోరారు. దీని విషయం పై సర్పంచ్ మాట్లాడుతూ కార్యదర్శి పై ఇంతవరకు ఎలాంటి పిర్యాదు రాలేదని మాకు ఇప్పుడే తెలిసిందని ఇకనుండి ఇలాంటి పద్ధతులు మార్చు కోవసిందిగా కోరారు లేని పక్షంలో పరిస్తితి  వేరే విదంగా ఉంటది అని హెచ్చరించారు. PACS చైర్మన్ సంపేట రాము మాట్లాడుతూ మన గ్రామంను అందరం కలిసి తీర్చిదిద్దుతామని ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సకాలంలో నెరవేర్చాలని స్మశాన వాటికను త్వరగా పూర్తి చేయాలని ఎందుకంటే చెరువులు నిండి చనిపోయిన వారిని కాల్చడానికి కూడా స్థలం లేదని అందువలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్మినేని రవీందర్, PACS చైర్మన్ సంపేట రాము, MPTC సతీష్, ఉపసర్పంచ్ యకన్న, PACS డైరెక్టర్ కాంతారావు, పంచాయతీ కార్యదర్శి శ్రీను, కోఆప్షన్ మెంబర్ యాకుబ్, స్కూల్ HM లు వార్డుఎంబర్స్,  ఏ ఎన్ ఎం లు ఆశ వర్కర్లు, అంగన్వాడీ  టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.