కట్టెపాడ తండాలో సిసి రోడ్ల నిర్మాణం

Published: Tuesday March 15, 2022
పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 14 మార్చి ప్రజాపాలన : గ్రామాభివృద్ధికి రోడ్ల వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. సోమవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామానికి అనుబంధ గ్రామమైన కట్టెపాడ తండా (పట్లూరు తండా)లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో 5 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ మాట్లాడుతూ కట్టెపాడ తండా అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు అనుబంధ గ్రామమైన కట్టెపాడ తండాను అభివృద్ధిలో నిర్లక్ష్యం చేయమని స్పష్టం చేశారు. ప్రతి వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని వివరించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమస్యలను గుర్తించి అంచెలంచెలుగా పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే నా దృష్టికి తేవాలని సూచించారు. తండాలో పాడు బడిన బావిని పూడ్చామని చెప్పారు. తండా అభివృద్ధికి సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న సురేష్, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గొల్లముసలి అశోక్, మండల మైనారిటీ అధ్యక్షులు షఫీ, రైతు బంధు అధ్యక్షులు శేఖర్ స్వామి, వార్డ్ మెంబర్స్ రంగా బాయి, నర్సిములు, నాయకులు సునీల్, నగేష్, గోపాల్, పాపయ్య, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.