భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి పుణ్య తిథి వేడుకలు -బాబాను దర్శించుకున్న కల్వకుంట్ల దంపతులు

Published: Friday October 07, 2022

కోరుట్ల, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరామ నది తీరాన గల శ్రీ శిరిడి సాయిబాబా104వ పుణ్య తిథి వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పుణ్య తిథి సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు, టిటిడి దేవస్థానం సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సరోజనమ్మ దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వారి రాక సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ద్వారా ఆహారం తయారు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దేవాలయం గోపురం పైన పూజలు నిర్వహించి సాయిబాబా జెండాను ఆవిష్కరించారు. భక్తుల కోసం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల దంపతులు ప్రారంభించారు .స్వామివారికి కాకడ హారతి, ఆలయ సంకీర్తన, అభిషేకము, పతకారోహణ, గణపతి పూజ పుణ్యవచనము, కలశాభిషేకము, విశ్వ కళ్యాణ  యజ్ఞము, భక్త మండలి వారిచే భజన కార్యక్రమాలు, విశేష హారతి ,తీర్థ ప్రసాదాల విత్తరణ, సంధ్యా హారతి, పల్లకి సేవ, సేజారతి కార్యక్రమాలను ఉదయము నుండి రాత్రి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను ,పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్ల పట్టణము ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసింది అన్నారు. పట్టణంలో ప్రతి ఒక్క దేవాలయము ఉందని ఆయా దేవాలయాలలో ప్రతినిత్యము స్వామివార్లకు పూజలు జరుగుతున్నాయని పలు వారాలలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడ లేని విధంగా కోరుట్ల పట్టణంలో మతసామరస్యాలకు కేంద్రంగా కోరుట్ల ప్రఖ్యాతిని దక్కించుకుందన్నారు.  ఈ పూజల్లో కోరుట్ల ,మెట్పల్లి, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ లు అన్నం లావణ్య అనిల్ , రాణవేణి సుజాత సత్యనారాయణ,భోగ శ్రావణి ప్రవీణ్, జగిత్యాల జిల్లా రైతుబంధు అధ్యక్షుడు చీటీ వెంకట్రావు, దేవాలయ అధ్యక్షుడు చీద్రాల భూమయ్య, ప్రధాన కార్యదర్శి  పురుషోత్తం రావు, ఉపాధ్యక్షుడు చిలువేరి విద్యాసాగర్, సహాయ కార్యదర్శి పోతాని ప్రవీణ్, కోటగిరి నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్లు బలిజ పద్మా రాజారెడ్డి ,జిందం లక్ష్మీనారాయణ ,బట్టు రాధికా సునీల్,  ఫాయిమ్ ,టిఆర్ఎస్ యూత్ పట్టణ అధ్యక్షుడు జాల వినోద్, నాయకులు సనావుద్దీన్, క్యాతం సృజన్, చిత్తరి ఆనంద్, చింతామణి ప్రభు, గుగ్గిళ్ళ సురేష్ గౌడ్  దేవాలయ పాలకమండలి సభ్యులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.                                భారీ బందోబస్తు...
  శ్రీ షిరిడి సాయిబాబా104 వ పుణ్య తిధి సందర్భంగా సాయిబాబా దేవాలయంలో గురువారం కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు నేతృత్వంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయిబాబా దేవాలయం ముందర వన్ వే ను ఏర్పాటు చేసి  వాహనదారులకు ,భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు .దేవాలయ ఆవరణలో పోలీసులచే భక్తులకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ బాబా దర్శనం కల్పించారు. ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. ఈ బందోబస్తులో కోరుట్ల ఎస్సైలు సతీష్ కుమార్, శ్యామ్ రాజ్  కోరుట్ల డివిజన్లోని వివిధ స్టేషన్లో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.                                చలివేంద్రం ఏర్పాటు....
శ్రీ సాయిబాబా పుణ్యతితి సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఆదర్శ పాఠశాలల చైర్మన్ అల్లే సంగయ్య జ్ఞాపకార్థం దేవాలయ ఆవరణలో చలివేంద్రాన్ని( నీటి వసతి )  నీ ఆయనతో విద్యను అభ్యసించిన స్నేహితులు ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ లు ప్రారంభించారు.