కవనసకిన వల్లభ పురస్కారం

Published: Wednesday September 01, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి నాశబోయిన నరసింహ (నానకవి)కు కవనసకిన వల్లభ పురస్కారం మల్లినాథ సూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ వారు కవన సకినం ప్రక్రియలో శతాధిక కవితలు పూర్తి చేసినందుకు గాను కవి, రచయిత నాశబోయిన నరసింహ కు "కవనసకిన వల్లభ"అనే బిరుదును ప్రదానం చేశారు. మల్లినాధ సూరి కళా పీఠం అధ్యక్షుడు అమరకుల చక్రవర్తి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ఏడు పాయల వనదుర్గా భవాని క్షేత్రంలో ఈ నెల 29, 30 తేదీల్లో నాలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న కవుల మహామేళాలో నాశబోయిన నరసింహ (నానకవి)కు "కవన సకిన వల్లభ"అనే సాహితీ పురస్కారం (బిరుదు)ప్రదానం మరియు మెమెంటో,శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నరసింహ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పర్యవేక్షకుడుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రవృత్తి పరంగా సాహితీ రచనలు చేస్తూ రెండేళ్లుగా మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల తెలుగు కవివరా వాట్సాప్ సమూహం ద్వారా వంద కవితలు రాసినందుకు తనకు ఈ బిరుదు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఆయన ఈ పురస్కారం అందుకోవడం పట్ల ఉమ్మడి రాష్ట్రాల సాహితీ మిత్రులు, వైద్యారోగ్య శాఖ సహోద్యోగులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.