శివారెడ్డిపేట్ మల్లికార్జున ఆలయంలో సద్దుల బతుకమ్మ ఉత్సవం

Published: Tuesday October 04, 2022
బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోటిగారి శివరాజ్
వికారాబాద్ బ్యూరో 3 అక్టోబర్ ప్రజాపాలన : దసరా శరన్నవరాత్రులలో సందర్భాన్ని పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించామని బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోటిగారి శివరాజ్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్ లోని మల్లికార్జున ఆలయం ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలలో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మలను మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడి పాడారు. నేటి యువత మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకూడదనే ఉద్దేశ్యంతో బతుకమ్మ సంబరాలను నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రతి పండుగ యొక్క విశిష్టతను నేటి సమాజానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను మల్లికార్జున మందిరం ప్రాంగణంలో గ్రామ మహిళలందరూ పెద్ద సంఖ్యలో బతుకమ్మలను పేర్చి ఒక దగ్గరికి చేర్చి ఆడి పాడడంతో చూపరుల కళ్ళు కట్టిపడేశాయి. బతుకమ్మకు సంబంధించిన ఉషారైన పాటలను డిజె సౌండ్ తో మహిళలందరూ అడుగులు వేస్తూ లయబద్ధ చప్పట్లతో ఆడడం మహిళల ఐకమత్యాన్ని గుర్తు చేస్తున్న దృశ్యం అద్భుతమని కొనియాడారు. సద్దుల బతుకమ్మలను మల్లికార్జున ఆలయము నుండి శివారెడ్డి పెట్ మెయిన్ రోడ్డు సమీపంలో ఉన్న దుర్గామాత ఆలయం వరకు అక్కడి నుండి శివారెడ్డి పెట్ లోగల పాత ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో చివరగా బతుకమ్మలను ఉంచి ఆడి పాడి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కే మధుకర్ టిఆర్ఎస్ నాయకులు కడియాల వేణుగోపాల్ ముదిరాజ్ దత్తు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.