రగిలే నిప్పుకణం . జంపాల చంద్రశేఖర్ ప్రసాద్* -పి డి స్ యూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పు

Published: Friday December 09, 2022
చెవెళ్ల డిసెంబర్ 08, (ప్రజాపాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో పుస్తక ఆవిష్కరణ పి డి స్ యూ రంగారెడ్డి కమిటీ  ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ..
భారతావని ఉజ్వల భవితవ్యపు స్వప్నం కోసం సాహసపేతంగా ప్రాణాలు కోల్పోయిన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ విద్యార్థి ఉద్యమాలతో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ నిర్మాణంతో విడదీయలేని విధంగా ముడిపడిన పేరు అని తెలియజేయడం జరిగింది. సామ్రాజ్యవాదం మరియు అభివృద్ధిని నమూనాలని ప్రశ్నించి భారతదేశం మొత్తం విద్యార్థి యువజన లోకానికి వెలుగులు నింపిన ప్రతినిధి అని తెలియజేయడం జరిగింది. 1975 జూన్ నుంచి 1977 మార్చి వరకు ఎమర్జెన్సీ నిరంకుశ పాలన కొనసాగిందని ఆనాటి చీకటి రోజులలో పి డి స్ యూ  నాయకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ని విజయవాడలో ఉండంగా పోలీసులు పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేసి అనంతరం తనని 1975 నవంబర్ 5న ఖమ్మం జిల్లా చీకటి గండ్ల అడవులలో కాల్చి చంపడం జరిగింది అని లాఠీలతో, తూటాలతో, చెరసాలలతో ఉద్యమాలను ఆపలేరని అతడి వారసులుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మరియు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గారి స్ఫూర్తితో విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా ముందుకు కదలాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేష్, నాయకులు: జైపాల్, లింగం, సురేష్, తదితరులు ఉన్నారు.