ఒకే ఇంట వికసించిన 36 బ్రహ్మకమలాలు

Published: Saturday August 07, 2021
వికారాబాద్ బ్యూరో 06 ఆగస్ట్ ప్రజాపాలన : ఆది దేవుడైన భోళా శంకరునికి ప్రీతిపాత్రమైన బ్రహ్మకమలాలు విరగబూస్తున్నాయి. బ్రహ్మకమలం పూవుతో శివునికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తే ఆ ఇంట అన్నీ శుభాలే కలుగుతాయని హిందువుల విశ్వాసం. అందుకే ప్రతి హిందూ కుటుంబం బ్రహ్మకమలాలు పెంచుకునేందుకు ఆరాటపడతారు. బ్రహ్మకమలాల మొక్కల ధరలు మొక్క యొక్క వయస్సును అనుసరించి ధరలు ఉంటాయని నర్సరీ పెంపకందారులు చెబుతున్నారు. ఆన్లైన్లో బ్రహ్మకమలం మొక్కల ధరలు కూడా ఆకాశం వైపు ఎగబాకుతున్నాయి. గురువారం రాత్రి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో మార్గం సంతోష్ కుమార్, మార్గం బృహక్ సాయి, మార్గం బృహతిల ఇంట ఒకే బ్రహ్మకమలం మొక్కకు 36 బ్రహ్మకమలాలు వికశించడంతో చుట్టుపక్కల జనం చూసి తరించారు. ఊరడి బాగయ్య, ఊరడి క్రిష్ణవేణి దంపతుల ఇంట వికశించిన బ్రహ్మకమలాలను చూడడానికి జనం ఆసక్తితో తరలివచ్చారు. రాత్రి పూట వికశించి ఉదయం కాగానే ముడుచుకుంటాయి. బ్రహ్మకమలాలను శివారయాలకు వెళ్ళి భక్తితో శివునికి అర్పించి కోరికలను నెరవేర్చమని వేడుకుంటారు.