విస్తృతస్థాయి సమావేశం నికి ముఖ్యఅతిథి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు కందిడి శ్రీరామ్ పాల్గ

Published: Wednesday June 29, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 28 ప్రజాపాలన ప్రతినిధి.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో నగర కేంద్రంలో జిల్లా విబాగ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కందడి శ్రీరామ్ పాల్గొని మాట్లాడుతూ... ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ యొక్క రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా పాఠ్యపుస్తకాలు దుస్తువులు విద్యార్థులకు  అందకపోవడం విడ్డూరమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.ఏ ఒక్క పాఠశాలలో కూడా మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల పేరుతో విద్యను వ్యాపారం గా మలుచుకుని సామాన్యమైనటువంటి తల్లిదండ్రులను మోసం చేస్తూ విచ్చలవిడిగా చెలరేగి పోతున్నాయి.తక్షణమే ఈ యొక్క ప్రైవేటు పాఠశాలల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలను,బట్టలను తక్షణమే ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణను ప్రకటించడం జరిగింది *ఈ నెల 30న డీఈవో జూలై 1 ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు ధర్నా. జూలై 4న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు,పాఠశాల యాజమాన్యాలు విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైద్రాబాద్ సిటీ  జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు K.శశిధర్ రెడ్డి,విభగ్ SFD కన్వీనర్ D సందీప్,నగర సంయుక్త కార్యదర్శి సంతోష్,ఢిల్లీ అనిల్.తదితరులు పాల్గన్నారు.