తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

Published: Saturday June 11, 2022
మేడిపల్లి, జూన్ 10 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన  కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని మేడ్చల్ జిల్లా బోగారం అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, మాజీ రాజ్యసభ సభ్యులు,
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో
 తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర కమిటీ కార్యక్రమాల సమీక్ష, సంస్థాగత నిర్మాణం పై చెయాల్సిన మార్పులు, చేర్పులు, తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ, నిర్ణయాలు  తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ కు సముచిత స్థానం కల్పించాలని రాష్ర్టముఖ్యమంత్రి కెసిఆర్ కు విన్నవిస్తూ వినతిపత్రం అందించేందుకు నిర్ణయిస్తూ తీర్మానం. నామినేటెడ్ పదవులను కేటాయించడంలో ముదిరాజులకు, ముఖ్యంగా ముదిరాజ్ యువతకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరేందుకు తీర్మానం. ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి మార్చుతు గతంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుచేయడంలో సుప్రీంకోర్టు పరిధిలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగించేందుకు రాష్ర్ట ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం. ఈ ఉత్తర్వులు అధికారికంగా అమలయ్యేవరకు రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న విద్య, వైద్యం, పోలీస్, గ్రూప్ 1 నియామకాలన్నింటిలోనూ ముదిరాజు అభ్యర్థులకు ప్రత్యక రిజర్వేషన్ ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం.
 33 జిల్లాలలో  ముదిరాజ్ యువజన చైతన్య సదస్సును నిర్వహించుట.
 తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువత విభాగం ఆధ్వర్యంలో సోషల్ మీడియా గ్రూపు మరియు  జాతీయ యువజన సదస్సును హైదరాబాదులో నిర్వహించుట. మత్స్య శాఖ నుండి వెలువడే అన్ని పథకాలలో కాంట్రాక్టులలో ముదిరాజ్ యువతకు ప్రాధాన్యం. యువతలో పనిచేసిన ముదిరాజ్ నాయకులకు తెలంగాణ ముదిరాజ్ మహాసభలో ప్రాధాన్యత. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ గౌరవ అధ్యక్షులు రోటం భూపతి ముదిరాజ్, గౌరవ సలహాదారులు పిట్టల రవీందర్ ముదిరాజ్, ముదిరాజ్ అధ్యయన వేదిక చైర్మన్ నీల రాములు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతర బోయిన కృపా సాగర్ ముదిరాజ్, కార్యాలయ కార్యదర్శి రవి కాంత్, రాష్ట్ర యువత అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీను, ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, సమన్వయకర్త బొక్క శీను తదితరులు పాల్గొన్నారు.