వర్షాన్ని లెక్క చేయకుండా నాలుగవ రోజు రిలే నిరాహారదీక్షలు

Published: Tuesday October 05, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 04, ప్రజాపాలన : తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షను సోమవారం భారీ వర్షం లో కూడా కొనసాగించారు. మద్దతుగా జిడబ్య్ల ఎసి ఉపాధ్యక్షులు వంశీ గౌడ్, ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చారులత, బీజేపీ నాయకులు, సీపీఐ నాయకులు సంగీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ ప్రచారకార్యదర్శి కునారపు భీమరాజు, మండల కమిటీ సలహాదారులు మామిడి సంపత్ గార్లకు రాష్ట్ర ప్రధానకార్యదర్శి అమరగొండ తిరుపతి పూలమాలలు వేసు దీక్షకు కూర్చోబెట్టారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సేపూరి గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలకు నుండి విరమించుకొని తిరిగి వచ్చిన గల్ఫ్ కార్మికులను అనాధలు గా చూడకుండా వారి నైపుణ్యాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల లోన్ ఇస్తూ వారిని హక్కునా చేర్చుకోవాలని అన్నారు. అలాగే అనివార్య కారణాల వలన గల్ఫ్ లో చనిపోతే వారి పార్థికదేహాలను పది రోజులలో కుటుంబానికి అప్పగిస్తూ 5 లక్షల ఆర్థికసహయం అందించాలన్నారు.  అసెంబ్లీ సమావేశాలలో తమ డిమాండ్లను  పరిశీలించాలని లేనియెడల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్, మండల కమిటీ అధ్యక్షులు పరకాల మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దుమల్ల ఎల్లయ్య గ్రామ కమిటీల నాయకులు కిరణ్, భూమన్న, మహేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, లస్మయ్య, గంగాధర్, వెంకటేష్, సత్యనారాయణ, భోజ రావ్, దినేష్, రవి, సత్యన్న, వెంకటేష్, మహేష్, మల్లేష్, పైడిపెల్లి సత్యన్న, రవి, మగ్గిడి గంగాధర్ లు పాల్గొన్నారు.