ప్రతిభ కు పేదరికం అడ్డు కారాదు డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల ఛంద్ర శేఖర్ గౌడ్

Published: Friday July 08, 2022
కరీంనగర్ జూలై 7 ప్రజాపాలన :
ప్రతిభ కల విద్యార్థిని, విద్యార్థులకు పేదరికం అడ్డు కాకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత సమాజం లోని ప్రతీ ఒక్కరిపై ఉందని ఉమ్మడి కరీం నగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల ఛంద్ర షెఖర్ గౌడ్ అన్నారు. ఈ రోజు ధ్రువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలని ప్రభుత్వ  ప్రాథమికోన్నత పాఠశాల లో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ  కార్యక్రమానికి  ముఖ్య అతిథి గా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ విద్య వల్లనే సమాజంలో సాధికారత  లభిస్తుందని కావున ప్రతీ ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు, వివిధ ట్రస్ట్ లు, దాతల సహకారంతో పేద అభ్యర్థులు  ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భం గా ధృవ ఫౌండేషన్  ఏటా నిర్వహిస్తున్న  ఉచిత  నోట్ పుస్తకాల పంపిణీ  కార్యక్రమాన్ని  అభినందించారు. ఈ కార్యక్రమంలో  ధృవ ఫౌండేషన్  చైర్మన్  మల్లేశం, మండల  విద్యాధికారి  శ్రీనివాస్ రెడ్డి, రాజభాను చంద్ర ప్రకాష్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, విద్యా కమిటీ  చైర్ పర్సన్  స్వరూప, శేఖర్,లింగయ్య, ప్రవీణ్, మోహన్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.