అనుమతులు లేకుండా రైల్వే బ్రిడ్జి ఖానాలు కబ్జా చోద్యం చూస్తున్న స్థానిక అధికారులు

Published: Tuesday April 04, 2023
బోనకల్, ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో మరల రైల్వే బ్రిడ్జి ఖానాలు ఎటువంటి అనుమతులు లేకుండా కబ్జాలు చేస్తున్నారు. మమ్మల్ని ఎవరేమి చేయలేరని అహంకారంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి కానాల కింద స్థలాలపై కన్నేశారు. నిత్యం అధికారులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు హడావుడిగా నిత్యకార్యకలాపాలు సాగించే మార్గంలో దూకుడు తనంతో కబ్జాకు పాల్పడుతు మీసం మేలేసారు. రైల్వే గేటు పై గత 2011లో 26 కోట్లనిధులతో ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి కింద ఉన్న ఖానాలలో పేదలు చిరు వ్యాపారులు చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం దుకాణాలు పెట్టుకోగా కొందరు కబ్జాదారులు అప్పట్లో ఒక్కొక్కరు ఐదు నుంచి పది షాపులు ఆక్రమించుకొని అద్దెలకు ఇచ్చేవారు. అప్పట్లో కూడా ఏ రాజకీయ నాయకుడు గానీ ప్రజా ప్రతినిధి గాని పట్టించుకోకపోవడంతో ఒకదశాబ్దం పాటు చిరు వ్యాపారులు పొట్టపోసుకోవటంతో పాటు కబ్జాదారులు కూడా బాగానే లాభపడ్డారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా
సాగదు కదా జిల్లా కలెక్టర్ వివి గౌతమ్ జిల్లాలో అడుగు పెట్టడంతో ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వస్థలాల్లో ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు
తీసుకునేలా పకడ్బందీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే 10 నెలల క్రితం బోనకల్ పర్యటించిన క్రమంలో జిల్లా కలెక్టర్ ఆక్రమణదారులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్కు అంతరాయం చూసి చర్యలు తీసుకునేందుకు ఆదేశించారు. కబ్జాదారులు పలుప్రయత్నాలు చేసిన ఎవరి ఒత్తేళ్లకు కలెక్టర్ లొంగక పోవడంతోపాటు ఉక్కు పాదంతో ఆక్రమణ తొలగించేలా చేశారు. దీంతో ఆర్ఓబి కింద
ఖానాలలో ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులను చేయించారు. కానీ ఇటీవల ఒక ఖానాలో ఆటో డ్రైవర్లు తమ ఆటోలు నిలుపుకునేందుకు ఫెన్సింగ్ వేసి స్థలాన్ని ఆక్రమించారు. మరొక కానాలో కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. బహిర్గత ప్రదేశంలో అధికారులు
ప్రజాప్రతినిధులు తిరిగే చోటులో ఫెన్సింగ్ వేసిన ఎవరు నోరు
మెదకపోవటం పలు విమర్శలకు తావిస్తుంది. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడటంతో కష్టమైనా చిరు వ్యాపారులు దూరప్రాంతాలకు వెళ్లి బతుకు జీవనం సాగిస్తుంటే కబ్జాకోరులు మాత్రం దర్జాగా మరలా
ఖానాలను ఆక్రమించటం దారుణమని వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.