ప్రజా సమస్యలపై దశలవారిపోరాటాలు : రాష్ట్ర బాధ్యులు పొన్నం వెంకటేశ్వరరావు పిలుపు

Published: Sunday October 10, 2021
మధిర, అక్టోబర్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మధిర బోడేపూడి భవన్లోరాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై దశలవారీ పోరు చేయనున్నట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు శనివారం స్థానిక బోడేపూడి భవన్లో చేసిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల భూములను కార్పొరేట్ రంగాలకు అమ్మివేయాలని చూస్తున్నారని, మరియు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 57సంవత్సరాలకే ఫించన్, దళిత బందు లాంటి సంక్షేమ పథకాలు ప్రచారానికి మాత్రమే ఉపయోగపడతాయని ఇంతవరకు ఈ పథకాలను రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వలేదని వెంటనే ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు పర్చాలని డిమాండ్ చేశారు స్థానికంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, ఖాళీ స్థలాలను శుభ్రపర్చటం, పందుల నివారించటం, రేషన్ కార్డులు, ఇండ్లు ఇండ్ల స్థలాలు, లాంటి కార్యక్రమాలపై ఈనెల 11వ తేదీన జరిగే ప్రాంతాల వారీగా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, నిర్వహించాలని 12వ తేదీన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని సమస్యలపై తహశీల్దార్లు కార్యాలయం ముందు జరిగే ధర్నాలను కూడా విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలోసిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాది నేని రమేష్, పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి కమిటీ సభ్యులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం.నర్సింహారావు, పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.