మెడికవర్ హాస్పిటల్ లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సెస్ విభాగం ప్రారంభం... హైదరా

Published: Wednesday September 28, 2022
వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకొని బేగంపేట్ లోని మెడికవర్ హాస్పిటల్ లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సెస్ ను ప్రారంభించారు ఫైర్ సేఫ్టీ అధికారి మోహన్ రావు ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమం లో  ఆయన  మాట్లాడుతూ సకాలంలో చర్యలు  తీసుకోకపోవడంవల్ల చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. క్లిష్టసమయాల్లో ప్రతి నిమిషం ముఖ్యమైనదని,జీవితాలు రక్షించటానికి ఇటువంటి అత్యాధునిక సదుపాయాలు ఎంతో ముఖ్యమన్నారు. డాక్టర్ సాకేత్   మాట్లాడుతూ గుండె కు సంబందించిన వ్యాదుల విషయం లో సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు, ఈ హాస్పిటల్ లో గుండె కు సంబందించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని మంచి కిటికల్ కేర్ డాక్టర్ ల టీం ఉండడం మంచి విషయమని,హెల్త్ కేర్ రంగంలో రాబోవు రోజుల్లో  కార్డియాక్ రంగంలో  మెడికవర్  హాస్పిటల్ అన్ని వసతులతో ఉండే హాస్పిటల్ గా నిలవబోతుందన్నారు.ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండా ఉండొచ్చు. గుండె ఆరోగ్యం కోసం కనీసం 30 నుంచి 40 నిమిషాలు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేయాలి దీనివల్ల ఒత్తిడి & డిప్రెషన్‌ తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మోహన్ రావు,కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ . సాకేత్,చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్  మహేష్ దెగ్లూర్కర్ , జనరల్ మెడిసిన్ రాజేష్, శ్రీలక్ష్మి, మేఘ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
Attachments area