ప్రజాగోస బిజెపి భరోసా

Published: Friday September 16, 2022
మీ సమస్యపై నా పోరాటం
* రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 15 సెప్టెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కళాశాలకు మర్రి చెన్నారెడ్డి పేరు నామకరణం
చేయాలని రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ సంయుక్తంగా డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి నుండి సిద్దులూరు వరకు జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంలో కొత్త మండలాలను ఏర్పాటు డిమాండ్ చేశారు.
మీ సమస్య పై నా పోరాటం
వికారాబాద్ జిల్లా హైదరాబాద్ మహా నగరానికి కూత వేటు దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోని జిల్లా
వికారాబాద్ జిల్లా అని గుర్తు చేశారు.
ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలే అసలు గ్రామాలకు వెళ్లడమే పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అద్వాన్నమైన రోడ్లతో అనునిత్యం ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మాకు మూడు నెలల పాటు పెన్సషన్ ఇవ్వకపోయినా
పర్వాలేదు కానీ రోడ్లు మాత్రం బాగుచేపించండని కోరుతున్నారు.
అది చూసి అయినా స్థానిక ఎమ్మెల్యే సిగ్గు తెచ్చుకోవాలని ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే అసమర్థత, చేతకాని ముఖ్యమంత్రి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వెల్లడించారు. కెసిఆర్ కు వికారాబాద్ అంటేనే చిన్న చూపుగా మారిందన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినం తెలంగాణ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించినం కానీ కెసిఆర్
మనల్ని మోసం చేసి దొర బుద్ది చూపిస్తున్నాడని విమర్శించారు.
ఇంటికో ఉద్యోగం లేదు, కేజీ టు పీజీ లేదు, డబుల్ బెదురూమ్ ఊసే లేదు
విద్యా వ్యవస్థ ను భ్రష్టు పట్టించిండు, కనీసం మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితి
దిశా నిర్దేశం లేని ధరణి వ్యవస్థ, సొంత భూములను కాపాడుకోలేని పరిస్థితి, రైతుల ఆత్మహత్యలు యువతకు ఉపాధి కల్పన లేక ఇతర రాష్ట్రాలకు కూలి పనులకు పోయే పరిస్థితి డిగ్రీ చదివిన యువకులు
పెయింటింగ్, మేస్త్రి పనులకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతకాని ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త పథకం తీసుకొచ్చిండని ఎద్దేవా చేశారు. ఎక్కడ రాజీనామా చేస్తే ఆ నియోజక వర్గం అభివృద్ధికి నిధుల వరద వస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నా నువ్వు రాజీనామా చెయ్ అప్పుడైనా దొర చూపు వికారాబాద్ వైపు పడుతుందేమోనని విచారం వ్యక్తం చేశారు. నేను గతంలో చేసిన పనులు, అభివృద్ధి తప్ప, తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెరాస గవర్నమెంట్ చేసిన
అభివృద్ధి శూన్యం అన్నారు. ప్రతి గ్రామానికి నేను వస్తున్నా, మీతో నేను, నాకు నువ్వు ఇటువంటి గప్పాలు కొట్టుకునే కార్యక్రమం
కాదని విశ్వాసం వ్యక్తం చేశారు.
మీ సమస్య పై నేను మీ తరుపున పోరాటం చేయడానికి సిద్ధం అయ్యానని హామీ ఇచ్చారు. మీ సమస్యలను నా దృష్టికి తీసుకురండి నేను మీ తరుపున పోరాటం చేస్తానని ప్రజలకు వాగ్దానం చేశారు.
మా కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి 24/7 ఎపుడైనా కాల్ చేయండి మేము స్పందిస్తాం.