నిరుపేదలకు ఆకలి తీర్చిన సన్ చారిటబుల్ ట్రస్ట్

Published: Tuesday June 08, 2021
అమీర్ పేట్, జూన్ 7, (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా మహమ్మారి పారదోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న లాక్ డౌన్ లో భాగంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సన్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. సోమవారం చాంద్రాయణ గుట్ట, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర  పరిసర ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు కిచిడి, వెజ్ బిర్యానీ, పెరుగు అన్నం, టమోటా రైస్ ప్యాకెట్ లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ఓల్డ్ సిటీ కోఆర్డినేటర్ సాబేర్ మీడియాతో మాట్లాడుతూ.... రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీల జీవితాలు లాక్ డౌన్ కారణంగా ఆకలితో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ మేరకు రోడ్డు పక్కన జీవనం కొనసాగించే నిరాశ్రయులైన వృద్ధులకు, యాచకులకు సాధ్యమైనంత వరకు సాయం చేయాలనే సదుద్దేశంతో గత సంవత్సరం లాక్‌డౌన్‌ నుంచి నేటి వరకు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా మాస్క్ దాని ఆవశ్యకతను ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని భవిష్యత్తులో కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రాంలో చేపడతామని తెలియజేశారు.