*తిన్మార్ మల్లనను మేషరతుగా విడుదల చేయాలి* అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన- మల్లన్

Published: Saturday April 15, 2023

చేవెళ్ల ఏప్రిల్ 14, (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చేవెళ్ల తీన్మార్ మల్లన్న టీం సభ్యులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్వీనర్ రాము,కో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రజాస్వామ్య బద్ధంగా కల్వకుంట్ల దొరల కుటుంబ పాలన ను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని దోపిడి దొంగల తీరుగా ఈ పాలన కొనసాగుతుందని, రాష్ట్రంలో ఉన్నవన్నీ అమ్ముకుంటూ దేశవ్యాప్తంగా దో నెంబర్ దందాలు చేస్తున్నారని,నీతి నిజాయితీగా పాలన కొనసాగడం లేదని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని నిర్భయంగా నిజం మాట్లాడిన తీన్మార్ మల్లన్న పై అక్రమంగా కేసులు పెట్టి జైలులో వేయడం సరైనది కాదని మండిపడ్డారు.పెట్టిన కేసులను వెంటనే ఎత్తేసి మల్లన్న ను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, అభిమానులు,మల్లన్న ద్వారా న్యాయం లబ్ధి పొందిన ప్రజలు ఏకమై ఒక్కసారిగా నిరసనలు ధర్నాలు చేసి ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న పవర్ ఏంటో చూపించి సెగ తగిలే విధంగా దేనికైనా ముందుకు దూసుకుపోతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో... తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.