బతుకమ్మ చీరల పంపిణీ చేసిన తీగల విక్రమ్ రెడ్డి

Published: Wednesday October 06, 2021
బాలాపూర్: అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చల్లా లింగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరలు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టల సబ్బులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పాల్గొని వారి చేతుల మీదగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. నిరు పేద ప్రజలకు ఇంటి పెద్దన్నగా కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తున్నారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 సెంటర్లో బతుకమ్మ చీరలు పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిద్దల లావణ్య, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఆర్కాల భూపాల్ రెడ్డి, తీగల మాధవి సాయినాథ్ రెడ్డి, ధనలక్ష్మీ రాజ్ కుమార్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, సిద్ధాల బీరప్ప, ఇంద్రావత్ రవి నాయక్, నీలా రవి నాయక్, అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, జిల్లల అరుణ ప్రభాకర్ రెడ్డి, బైగళ్ళ బాలమణి, గౌరీ శంకర్, కో ఆప్షన్ సభ్యులు జంగయ్య, డ్వాక్రా మహిళలు, అభిమానులు, మున్సిపల్ సిబ్బంది, టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.