రాయితీపై ఆయిల్ ఫాం మొక్కలు, డ్రీఫ్

Published: Friday November 25, 2022
తల్లాడ, నవంబర్ 24 (ప్రజాపాలన న్యూస్): 
తల్లాడ 
మండల పరిధిలోని మిట్టపల్లిలో సత్తుపల్లి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు యు. నరసింహారావు అధ్యక్షతన  మండలంలో ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణం పెంపుదల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి  జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని అనసూయ,కెవికె వైరా శాస్త్రవేత్త డాక్టర్ జే హేమంత్ కుమార్ హాజరయ్యా  మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ మొక్కలను, డ్రిప్ ను రాయతీపై అందజేస్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేయదలచిన రైతులకు మొక్కకు 173 రూపాయలు ప్రభుత్వం చెల్లించగా రైతు వాటా కింద 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అలానే ఎకరానికి 57 మొక్కలు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఆసక్తి గల రైతులు  వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారి వినతులు  అందజేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్, ఏఈవోలు పాల్గొన్నారు.