కంకర మిషన్లు వద్దు వ్యవసాయం ముద్దు - బండరావిరాల , చిన్నరావిరాల సర్వే నెం. 268 భూములు కోల్పోయిన ర

Published: Wednesday October 19, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  అబ్దుల్లాపుర్ మెట్ మండల పరిధిలోని బండరావిరాల మరియు చిన్నరావిరాల గ్రామాలకు చెందిన 268 సర్వే నెంబర్ గల భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, కంకర మిషన్లు వద్దు వ్యవసాయం ముద్దు అంటూ దళిత, బడుగు బలహీన వర్గాల రైతులు 64వ నిలే నిరాహార దీక్షకు వ మద్దతు తెలుపుతూ వారి నిరసన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డీ మాట్లాడుతూ వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు వ్యవసాయం చేసే భూముల్లో కంకర మిషన్లు పెట్టడం దారుణమన్నారు
ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ చిన్నారావిరాల సర్పంచ్ కవడి శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్, వార్డు మెంబర్ అరుణ్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area