104 ఉద్యోగులకు వేతనాలు వెంటలే చెలించాలి ఎన్.ఎస్.యు.ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్.

Published: Friday July 15, 2022
కోరుట్ల, జూలై 14 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల పట్టణంలో గురువారం రోజున   జరిగిన విలేఖర్ల సమావేశాల్లో ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  పనిచేస్తున్న 104 ఉద్యోగులకు సంబందించిన మూడు నెలల వేతనాలు ప్రభుతం ఇప్పటివరకు చెల్లించలేదు. ఏప్రిల్  మే. జూన్ కు సంబందించిన వేతనాలు ప్రభుత్వం వెంటనే విదుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు సదుల వినయ్ డిమాండ్ చేశారు.
 104 సర్వీసులు ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నిషన్ డ్రైవర్  సెక్యూరిటీ గార్డ్  డి ఈ ఓ లు రాష్ట్ర వ్యాప్తంగా 1300 మంది విధులు నిర్వహిస్తున్నారని  తెలిపారు. వేతనాలు రాకపోవడం తో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం పాఠశాల కు వెళ్లే సమయం పిల్లలకు ఫీజలు పుస్తకాలు కొనే పరిస్థిలో కొందరు ఉద్యోగులు లేరని ప్రభుత్వం ఆలోచించి వెంటనే వేతనాలు విడుదల చేయాలి కోరుతున్నాను మూడు నెలల నుండి వేతనాలు రావడం లేక  పూట గడవని పరిస్థిలో లో కూడా కొందరు ఉద్యోగులు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించి వీరిని ఆదుకోవాలన్నారు.