25 వేల కోట్లకు మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారు -- పాల్వాయి స్రవంత

Published: Wednesday September 28, 2022

చౌటుప్పల్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే 97 వేల ఓట్లతో గెలిపిస్తే 25 కోట్ల రూపాయలకు మునుగోడు ప్రజల నమ్మకాన్ని అమ్ముకున్నారని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రారంభించి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఇటీవల కాలంలో గ్రామంలో మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్వాది యాదయ్య కుటుంబానికి 40, వేల రూపాయలు, గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పోలోజు విశ్వనాథ్ చారి కి 10 వేల రూపాయలు, అస్సోనిగూడెం లో అనారోగ్యంతో బాధపడుతున్న ఆకిటి అరుణ కు 20వేల రూపాయల, ఆర్థిక సహాయాన్ని పాల్వాయి స్రవంతి అందజేశారు. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ తన నాన్నగారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు ప్రచారం మొదలుపెట్టిన జై కేసారం గ్రామం నుండి మొదలుపెట్టేవారని. నేను కూడా జై కేసారం గ్రామం నుండి ప్రచారం మొదలుపెట్టానని అన్నారు. మునుగోడు ఆడపడుచు గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న నాకు మహిళలు బ్రహ్మరథం పలుకుతున్నారన్నారు. మునుగోడు ప్రజలను, కాంగ్రెస్ పార్టీని, మోసం చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీలో చేరి మళ్ళీ మునుగోడు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు ఒక్కసారి ఆలోచించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్, వంటనూనె, రేట్లు పెంచడమే కాకుండా పసిపిల్లలకు తాపించే పాల ప్యాకెట్లకు కూడా జీఎస్టీ వేశారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశంలో పేద ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి, పార్టీలు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ధన బలం లేకున్నా కానీ ప్రజాబలం ఉందన్నారు. ప్రజా బలం ముందు ధన బలం తలవంచక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ హాయామంలోనే గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పడ్డాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నారు. అందరికీ అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజలు ఒక్కసారి మునుగోడు ఆడపడుచు గా నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి సైదులు గౌడ్, డిసిసి కార్యదర్శులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నరసింహ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ యమునా యాదగిరి,  గ్రామ శాఖ అధ్యక్షులు పొట్ట సత్యనారాయణ, నాయకులు మాధగోని శేఖర్ గౌడ్, తాటి రవి, మైలారం సైదులు, బండమీది సైదులు, గంగాదేవి మల్లేష్, తాటి అమర్, గంగాదేవి జ్యోతి, తాటి సంధ్య, అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.