మేగా వైద్య శిభిరానికి బారీ స్పందన.

Published: Tuesday March 29, 2022
20రకాల పరిక్షలు చేసి మందులు పంపిణీ చేసిన వైద్యులు.
మంచిర్యాల బ్యూరో, మార్చి 28, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో  నేషనల్ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పగిడిపల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మేగా ఉచిత వైద్య శిభిరాని కి  బారీ స్పందన వచ్చింది. ఈ ఫ్రీ మెడికల్ క్యాం పులో రక్త, మూత్ర పరిక్షలు,  ఇసీజి, సుగర్, ఎక్స్రే, డెంటల్, కంటి పరిక్షలతో పాటు దాదాపుగా ఇరువై రకాల పరిక్షలు చేసి వ్యాధి నిర్దారించుకుని రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాదాపుగా ఐదువందల మందికి పరిక్షలు చేసి రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ జేఏసీ పౌడర్ ప్రెసిడెంట్ డా.కె.రోనాల్డ్ జాన్, నేషనల్ జనరల్ సెక్రటరీ డా.కలిమెల దేవదాస్, నేషనల్ అధికార ప్రతినిధి రూబీ కిరణ్, నేషనల్ న్యాయ సలహాదారులు పగిడిపల్లి పాల్, అలాగే కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ లతో కలిసి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ద్వారా రోగులకు పూర్తి స్థాయిలో పరిక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈలాంటి కార్యక్రమాలతో నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించి సహాకరించామనే తృప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మంచిర్యాల జిల్లా కన్వీనర్ ప్రేమ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షు రాలు జయ పాస్టరమ్మ తదితరులు పాల్గొన్నారు.