చాంద్రాయన్ పల్లి మాడల్ సిద్ధం చేయాలి

Published: Tuesday January 31, 2023
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె నిఖిల
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజా పాలన : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి మోడల్ పాఠశాలల పనులను రేపటి వరకు అన్ని హంగులతో  ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం మోమిన్ పేట  మండలంలోని చాంద్రాయన్ పల్లి, అమరాదికుర్దు  గ్రామంలో ఎంపికైన మోడల్ పాఠశాల పనుల పురోగతిని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ఎపికైన మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించుకో బోతున్నామని, పనులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని రకాల పనులను రేపటి వరకు పూర్తి చేసి అన్ని హంగులతో సిద్ధం చేయాలన్నారు.  ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. అవసరమైన గ్రీన్ చాక్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకా దేవి, పంచాయతీ రాజ్ ఏ ఈ ప్రణీత్ చాంద్రాయన్ పల్లి  సర్పంచ్ అంజయ్య, అమరాది కుర్దు  సర్పంచ్ సునీత, ఎం ఈ ఓ గోపాల్, ఆర్ ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.